నిబంధనలు

 • భారతదేశంలో నివసిస్తున్నవారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.
 • మీ జట్టును సమకూర్చుకునేందుకు మీకు 1,200 పాయింట్ల బడ్జెట్ ఇవ్వబడుతుంది.
 • ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉండాలి.
 • ప్రతి ఆటగాడికి ఒక వెల నిర్ణయించబడి ఉంటుంది, దానిని అనుసరించి మీ జట్టులోని ఆటగాళ్ల మొత్తం విలువ 1,200 పాయింట్ల బడ్జెట్ను మించిపోకుండా ఉండేలా చూసుకోవాలి.
 • మీరు జట్టుని ఈ విధంగా ఎంపిక చేసుకోవాలి:
  4-5 బ్యాట్స్‌మన్2-4 బౌలర్‌లు2-4 ఆల్‌రౌండర్‌లు1 వికెట్ కీపర్
 • మీరు నాకౌట్ మ్యాచ్లతో సహా మొత్తం టోర్నమెంట్లో ఉపయోగించుకోగలిగేలా మీకు 30 సబ్స్టిట్యూషన్లు ఇవ్వబడతాయి
 • మీరు ప్రారంభంలో ఎంచుకునే జట్టు కోసం సబ్స్టిట్యూషన్లు ఏవీ తగ్గించబడవు. మీ మొదటి ప్రామాణిక జట్టును సేవ్ చేసుకున్న తర్వాత కూడా ఏవైనా మార్పులు చేసారంటే, తదనుగుణంగా మిగిలి ఉండే సబ్స్టిట్యూషన్ల సంఖ్య తగ్గుతుంది.
 • అన్ని సబ్‌స్టిట్యూషన్‌లను మ్యాచ్ జరిగే రోజు ప్రారంభానికి 1 నిమిషంలోపు పూర్తి చేసేయాలి.
 • మ్యాచ్ జరుగుతుండగా మీ జట్టుకు మార్పులను చేయలేరు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీ జట్టుకు చేసే ఎలాంటి మార్పులైనా మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే ప్రభావితమవుతాయి.
 • ప్రతి 11 మంది సభ్యుల జట్టుకు ఒక కెప్టెన్ ఉండాలి.
 • ప్రతి మ్యాచ్లోనూ కెప్టెన్లకు రెండింతల పాయింట్లు లభిస్తాయి (గెలిస్తే రెండింతల పాయింట్లను పొందుతారు, అలాగే ఓడారంటే రెండింతల పాయింట్లను కోల్పోతారు).
 • మీరు ప్రతి మ్యాచ్కు ముందు మీ కెప్టెన్ను మార్చవచ్చు, అయితే ఆ ఆటగాడు మీ జట్టులోనే ఉండి ఉండాలి. కెప్టెన్ని మార్చడం వలన సబ్స్టిట్యూషన్లు తగ్గవు.
 • ఒక రోజులో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 3 జట్లకు రోజువారీ బహుమతులు మరియు టోర్నమెంట్ అంతటా అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 3 జట్లకు మొత్తానికి కలిపి అందించే బహుమతులు అందజేయబడతాయి.
 • ఒకవేళ మ్యాచ్ టై అయిన సందర్భాల్లో, క్రింద పేర్కొన్న క్రమంలోని మార్గాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు:
  • తక్కువ బడ్జెట్ వినియోగించినవారు
  • తక్కువ సబ్స్టిట్యూషన్లు ఉపయోగించుకున్నవారు
  • ముందుగా జట్టును ఏర్పాటు చేసినవారు (ఏ జట్టును ముందు సేవ్ చేసారనే దాని ఆధారంగా నిర్ణయించబడుతుంది)
  • అయినప్పటికీ విజేత నిర్ణయింపబడని పక్షంలో, రాండమ్ పిక్కర్ పద్దతిలో విజేతను ప్రకటించడం జరుగుతుంది